పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు: వైఎస్‌ జగన్‌ | West Godavari District Will Be Named After Alluri Sitarama Raju Says YS Jagan | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు: వైఎస్‌ జగన్‌

May 25 2018 8:06 PM | Updated on May 25 2018 8:21 PM

West Godavari District Will Be Named After Alluri Sitarama Raju Says YS Jagan - Sakshi

సాక్షి, ఆకివీడు: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ సరైన విధంగా గౌరవించలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి వచ్చిన క్షత్రియ కులస్తులు ఇదే విషయాన్ని గుర్తుచేశారు. రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. జననేత నిర్ణయాన్ని హర్షిస్తూ సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పాదయాత్రలో భాగంగానే కొద్ది రోజుల కిందట నిమ్మకూరులో జనంతో మమేకమైన జగన్‌.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement