
ఫలితాల విషయంలో కొంత అనుమానాలు ఉన్న మాట..
ఖమ్మం జిల్లా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియా నాయక్‌లతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ఖమ్మంలో ప్రజా కూటమిని గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల విషయంలో కొంత అనుమానాలు ఉన్న మాట వాస్తమేన్నారు. డబ్బు, మందు, ప్రలోభాలకు లొంగకుండా ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని అన్నారు.
ప్రజల మద్ధతుతో రాబోయే సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఓటర్లకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. నీతి,నిజాయతీతో మహాకూటమి వైపు మద్ధతు పలికిన ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యపరిరక్షణలో మీడియా పాత్ర అమోఘమన్నారు.ఏదేమైనా ఈ ఎన్నికల్లో మా ఊహకు అందని ఫలితాలు వచ్చాయని అన్నారు.