చంద్రబాబుకు మతిభ్రమించింది | Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మతిభ్రమించింది

Apr 20 2020 4:26 AM | Updated on Apr 20 2020 4:40 AM

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పదవి పోయిందనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబుకు మతిభ్రమించిందని.. అందుకే విలువలు వదిలేసి స్వార్థ రాజకీయాల కోసం మానవ జాతికే కీడు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. 

► ప్రజలంతా ఏకమై అధికార పీఠం నుంచి చంద్రబాబును దించేసినా ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమలో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. 
► తన ‘ముత్యాల ముగ్గు’ బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. లేనిపోని ఆరోపణలతో రోజుకో లేఖ రాస్తూ చంద్రబాబు తన రాక్షస ప్రవృత్తిని చాటుకుంటున్నారు.  
► చినబాబు ‘సైకిల్‌’ తొక్కాలని ఆశ పడుతుంటే.. పెదబాబు మాత్రం సైకిల్‌ దిగట్లేదు. పార్టీని కరోనా గబ్బిలంలా పట్టుకు వేలాడుతున్నారు.  
► రాజకీయాల్లో లోకేష్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసి గెలవలేరు. రాజ్యసభకు వెళ్దామన్నా అయ్యేట్లు లేదు. దీంతో లోకేష్‌ భవిష్యత్‌ ఏమిటంటూ చంద్రబాబుపై కుటుంబం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. 
► సోమవారం జన్మదినం జరుపుకునే చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాలనో.. దేవుడు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఇవ్వాలనో మేం కోరుకోవట్లేదు. కనీసం మనిషిగానైనా ఉండాలని ఆశిస్తున్నాం.  

‘కన్నా’ అమ్ముడుపోయారు..  
కరోనా కట్టడి విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే ఆ పార్టీ నుంచి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. 
► బీజేపీ కేంద్ర నాయకత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారు. వారిద్దరికీ మధ్య బ్రోకర్‌ సుజనా చౌదరే. 

టీడీపీ ఆరోపణలు అవాస్తవం..: మంత్రి ముత్తంశెట్టి
► విశాఖలో కరోనా కేసులను దాస్తున్నారనే టీడీపీ నాయకుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటిని వాస్తవమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. 
► అవాస్తవమని తేలితే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పదవిని వదులుకుంటారా. చంద్రబాబులా దాచుకోవడానికి ఇవేవీ కరెన్సీ కట్టలు కాదు. కరోనా కేసులు.  
► కట్టుదిట్టమైన చర్యలతో కరోనాను కట్టడి చేస్తున్న యంత్రాంగాన్ని అభినందించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం దారుణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement