‘తుంటరి ఎంపీ, చిలిపి ఎమ్మెల్సీలు’ | sampath kumar slams balka suman | Sakshi
Sakshi News home page

‘తుంటరి ఎంపీ, చిలిపి ఎమ్మెల్సీలు’

Jan 12 2018 4:33 PM | Updated on Mar 18 2019 8:57 PM

sampath kumar slams balka suman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై టీఆర్ఎస్‌ నాయకులతో బహిరంగంగా చర్చించేందుకు శుక్రవారం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన గన్‌పార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సవాల్‌ విసిరి చర్చకు రాకుండా తుంటరి ఎంపీ, ఇద్దరు చిలిపి ఎమ్మెల్సీలు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. వీరిని ప్రగతి భవన్‌కు పిలిచి ముఖ్యమంత్రి మొట్టికాయలు వేశారని వ్యంగ్యంగా అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌కు దొరల వెంట తిరిగి కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. ఆయన స్థాయికి ఉత్తమ్‌కుమార్‌, జానారెడ్డి, షబ్బీర్ అలీ రావాలా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ అంశంపై కాంగ్రెస్‌ పార్టీతో బహిరం‍గ చర్చకు సిద్ధమని ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

నేను కేసీఆర్‌ టైపు కాదు
తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారడానికి తాను సీఎం కేసీఆర్ టైపు కాదన్నారు. ముక్కిపోయిన టీఆర్ఎస్‌ పార్టీలో ఎవరు చేరతారని సంపత్‌కుమార్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement