చంద్రబాబు విషప్రచారాన్ని తిప్పికొట్టండి

Sajjala Ramakrishna Reddy Fires On Cm Chandrababu Naidu - Sakshi

టీడీపీ పాలనలోని అరాచకాలను క్షేత్రస్థాయిలో వివరించండి

వైఎస్‌ జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం

గూడూరు నేతలకు చేదోడువాదోడుగా మేకపాటి గౌతమ్‌రెడ్డి

వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రత్యేక హోదా విషయంలో రోజుకోమాట మార్చి చివరకు హోదాను తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో–ఆర్టినేటర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాటు హోదా సంజీవని కాదంటూ మాట్లాడి హోదా కోసంసాగిన ప్రజాపోరును నియంతలా సీఎం చంద్రబాబు అణిచివేశారన్నారు. ఇప్పుడు హోదా కోసం కృషి చేస్తున్నానని తన ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. గురువారం నెల్లూరులో ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి నివాసంలో గూడూరు నియోజకవర్గ నాయకుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల∙మాట్లాడుతూ ఓటుకు నోటు కేసుతో పాటు ఇతర కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా లాలూచీ పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి మళ్లీ ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు తన శ్రేణులను రంగంలోకి దించాడన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఉద్యమాలు నిర్వహించామని అలాగే పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టి రాజీలేని పోరాటం చేస్తున్నామని సృష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన నాలుగేళ్లలో లెక్కలేనన్ని హమీలు గప్పించి ఒక్కదానిని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్తకర్తలు ఉదాహరణలతో సహ ప్రజలకు వివరించి పాలకుల దమననీతిని క్షేత్రస్థాయిలో బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు.

సమష్టికృషితో ముందుకు వెళదాం
అందరం సమష్టికృషితో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మన ముందున్న ఎకైక లక్ష్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమేనని ఆ దిశగా అందరం మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో పార్టీ బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో పట్టుదలతో వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేద్దామన్నారు. ప్రధానంగా పార్టీకి కార్యకర్తలే కొండంత బలం అని, పార్టీ కార్యకర్తల కష్టాన్ని పార్టీ ఎన్నటికీ మరిచిపోదని చెప్పారు. గతంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించిన రీతిలో నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలకు పరిష్కరించే దిశగా రాజీలేని పోరాటం చేయాలని శ్రేణులకు సూచించారు.

చేదోడువాదోడుగా ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి గూడూరు నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటారని, అక్కడ శ్రేణులకు ఆయన చెదోడు వాదోడుగా ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పార్టీ ప్రాధాన్య అంశాలను వివరించారు. సమావేశంలో తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజవర్గ సమన్వకర్త మేరిగ మురళీధర్, పార్టీ ముఖ్యనేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, బాపట్ల  పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు కోడూరు కల్పలత, గూడూరు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు విషప్రచారాన్ని తిప్పికొట్టండి
సాగిన ప్రజాపోరును నియంతలా సీఎం చంద్రబాబు అణిచివేశారన్నారు. ఇప్పుడు హోదా కోసం కృషి చేస్తున్నానని తన ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. గురువారం నెల్లూరులో ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి నివాసంలో గూడూరు నియోజకవర్గ నాయకుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసుతో పాటు తదితర కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వంలో పూర్తిగా లాలూచీ పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి మళ్లీ ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు తన శ్రేణులను రంగంలోకి దించాడన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఉద్యమాలు నిర్వహించామని అలాగే పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టి రాజీలేని పోరాటం చేస్తున్నామని సృష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన నాలుగేళ్లలో లెక్కలేనన్ని హమీలు గప్పించి ఒక్కదానిని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్తకర్తలు ఉదాహరణలతో సహ ప్రజలకు వివరించి పాలకుల దమననీతిని క్షేత్రస్థాయిలో బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top