మోదీ ట్వీట్‌పై రోహిత్‌ శర్మ స్పందన | Rohit responds to Modis plea, calls voting most important tool for better future | Sakshi
Sakshi News home page

మోదీ ట్వీట్‌పై రోహిత్‌ శర్మ స్పందన

Mar 15 2019 2:11 PM | Updated on Mar 15 2019 2:12 PM

Rohit responds to Modis plea, calls voting most important tool for better future - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను ఉత్తేజపరచాల్సిందిగా సెలబ్రిటీలను కోరిన సంగతి తెలిసిందే.  ఇందులో భారత క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలను అత్యధిక ఓటింగ్ నమోదయ్యేలా ప్రజలను ఉత్తేజపరచాలని మోదీ కోరారు. ఈ మేరకు వీరిని ట్యాగ్‌ చేస్తూ మోదీ ట్వీట్‌ చేశారు.
 
దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ఆయుధం అని రోహిత్ అన్నాడు. ‘మన భవిష్యత్తు బాగుండాలంటే.. మన దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ఓటు. ఓటు వేయడాన్ని అందరు బాధ్యతగా భావించాలి.దీన్ని అందరూ సీరియస్‌గా తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement