గిరిజనుల మధ్య చిచ్చుపై మౌనమేల?

ravindranaik on tribals - Sakshi

మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్‌

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన తెగల మధ్య అదృశ్య శక్తులు చిచ్చు పెట్టాయని, సామ రస్యంగా సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్‌ విమర్శించారు.

గాంధీ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 గిరిజన తెగలున్నాయని, వాటిలో లంబాడా, ఎరు కల తెగలు కలిపి 80% ఉంటారని చెప్పా రు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిరిజనుల మధ్య కొట్లాట శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు. దీనిపై ప్రభు త్వం ఉదాసీనంగా ఎందుకున్నదో అర్థం కావడం లేదన్నారు. ఈ సమస్యకు గల కారణం, కారకులు ఎవరో గుర్తించేందుకు గవర్నర్‌ దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top