ప్రియాంక గాంధీ వీడియో వైరల్ ‌: స్మృతి ఇరాని గుర్రు

Priyanka Gandhi  video with children sets up row. Smriti Irani has a view - Sakshi

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు.  ఈ క్రమంలో  ప్రచారంలో స్థానిక పిల్లలతో ముచ్చటించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌లో మండిపడ్డారు.  కల్లా కపటం తెలియని పిల్లలు ప్రధానమంత్రి మోదీపై రెచ్చగొడుడుతున్నారని ట్వీట్‌ చేశారు. ప్రధానిని దుర్భాషలాడేలా నెహ్రూ-గాంధీ కుటుంబం రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్నప్రధాని పట్ల అనుచిత నినాదాలు చేసేలా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వారిని ప్రోత్సహించడమేమిటని ఆమె దుయ్యబట్టారు.  

దీనిపై స్పందించిన కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్  కన్వీనర్‌ సరళ్ పటేల్,  అబద్ధాలాడటం మీ డీఎన్‌ఏలోనే  ఉందంటూ స్మృతి ఇరానీకి కౌంటర్‌ ఇచ్చారు. వీడియోను  కట్‌ చేసి..వాస్తవాలను దాచి మభ్యపెట్టడం ఇక ఆపండి.. మీ డిగ్రీ సర్టిఫికెట్‌లాగా ప్రతిదాన్ని ఫేక్‌ చేయొద్దంటూ సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన ఆయన మరో వీడియోను కూడా షేర్‌ చేశారు.

అయితే అమేధీలో నిర్వహించిన ప్రచారంలో  భాగంగా ప్రియాంక కొంతమంది  స్థానిక పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా  ‘చౌకీదార్ చోర్ హై’  అంటూ  నినాదాలు చేశారు. నవ్వుతూ వారిని ఉత్సాహపరుస్తూ,  ప్రియాంక వారి నినాదాలను ఎంజాయ్ చేశారు. కానీ ఆ తరువాత పిల్లలు మరింత ఉత్సాహంగా అభ్యంతర కరంగా నినాదాలు  చేస్తోంటే.. వారిని వారించారంటూ ఆయన వివరణ ఇచ్చారు.  ఇది మంచిది కాదు.. మంచి పిల్లల్లా మెలగండి  అంటూ ప్రియాంక హితవు పలికారని తెలిపారు. 

కాగా యూపిలోని అమేధినుంచి  ప్రియాంక  సోదరుడు,  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ , రాయబరేలినుంచి ప్రియాంక తల్లి, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్‌సభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 5వ దశ ఎన్నికల్లో భాగంగా మే 5 న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.  

Uncouth to the core. Imagine the filthiest of abuses that a Prime Minister has to endure from people whose only claim to fame is a nose. Lutyens outrage anyone ???? https://t.co/T5sPyKtmbr

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top