చంద్రబాబులో నైతికత చచ్చిపోయింది

Posani Krishna Murali Fires on Chandrababu - Sakshi

ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నాడు

అమరావతికి పారిపోయి శిక్ష తప్పించుకున్నాడు

మీట్‌ ది ప్రెస్‌లో ధ్వజమెత్తిన సినీనటుడు పోసాని

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్‌ నుంచి అమరావతి పారిపోయిన ఏపీ సీఎం చంద్రబాబులో నైతికత చచ్చిపోయిందని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి ధ్వజమె త్తారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేం దుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాళ్లు పట్టుకుని.. తనకు శిక్షపడకుండా బాబు తప్పిం చుకున్నాడన్నారు. కొన్నేళ్లపాటు బీజేపీ కాళ్లు నాకిన బాబు.. గతంలో వాజ్‌పేయ్‌.. మొన్నటి వరకు మోదీని పొగిడి.. ఇప్పుడు తిడుతున్నాడ న్నారు. బాబు ఎవరినైనా వాడుకోగల సమర్థు డని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు (2014)లో మోదీ కాళ్లు పట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా వద్దు..  ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అని పేర్కొన్న బాబు.. ఇప్పుడు ‘‘హోదా ఇవ్వని మోదీ దెయ్యం’’ అంటూ తిడుతున్నాడని విమర్శించారు. 

బాబు.. అందర్నీ వాడుకున్నాడు
తన రాజకీయ జీవితంలో చంద్రబాబు కమ్యూ నిస్టులు, ముస్లింలు, బీజేపీ, ఎన్‌టీఆర్, వాజ్‌ పేయి, మోదీ, పవన్‌కళ్యాణ్‌ సహా ప్రజలను, అన్ని వర్గాల్నీ మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రస్తుతం జగన్‌ను తిట్టడం ద్వారా పబ్బం గడుపుకునేందుకు బాబు పాకులాడుతున్నా రన్నారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తనపై వివిధ కోర్టుల్లో నమోదైన 15 కేసుల విచారణపై ఎందుకు స్టే తెచ్చు కున్నాడని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎవ రిని ఎలా మేనేజ్‌ చేశారో ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులను ఆశగా చూపి, తన పార్టీలో చేర్చు కున్నాడన్నారు. అమరావతిలోని  తాత్కాలిక  సచివాలయంలో వర్షాలు కురిసినపుడు 4 కిటికీలు ఊడిపడ్డాయని.. తరచూ జలమయం అవుతోందన్నారు. బాబు అభివృద్ధి ఏపాటిదో జనం గమనిస్తున్నారన్నారు.   

జగన్‌ గెలిచేవారే...
గత ఎన్నికల్లో జగన్‌ మోహన్‌రెడ్డి రైతు రుణ మాఫీ చేస్తానని హామీ ఇస్తే ఎన్నికల్లో గెలిచే వారన్నారు. ఇటీవల పాదయాత్రలో జగన్‌ను కలిసి ఈ విషయం ప్రస్తావించినపుడు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వనని.. ప్రజలకేది చెబితే అదే అమలు చేస్తానని, రైతులను ఎట్టి పరిస్థితు ల్లోనూ మోసం చేయబోనని జగన్‌ స్పష్టం చేశారన్నారు. రుణమాఫీకి మించి రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తానని చెప్పిన జగన్‌పై తనకున్న గ్రేటెస్ట్‌ ఫీలింగ్‌ ఎవరెస్ట్‌ స్థాయికి చేరిందన్నారు. ప్రజలను ప్రేమించి.. వారి కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి వద్దకు వెళుతోన్న గొప్ప నాయకుడు జగన్‌ అన్నారు. చంద్రబాబు ఆడుతోన్న అబద్ధాలు, మోసాలను జగన్‌ ప్రజల్లో చెబుతున్నారని.. బాబుపై ఎలాంటి నిందలు వేయడం లేదని స్పష్టం చేశారు.  బాబు మాత్రం జగన్‌ను అన రాని మాటలు అంటున్నాడన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు మంచివారో, ఎవరి గుణం ఎలాంటిదో నిర్ణయించుకుని ఏపీ ప్రజలు ఓటు వేయాలని కోరారు. మొన్నటి వరకు ఢిల్లీలో బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్ర బాబు తనయుడు లోకే శ్‌.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని చెప్పడం దారుణమన్నారు.  

జెండా లేని నాయకుడు చంద్రబాబే...
ఏపీలో జగన్, పవన్‌లకు జెండాలున్నాయని.. చంద్రబాబుకు మాత్రం జెండా లేదని.. ప్రస్తుతం ఉన్న జెండా, పార్టీ ఎన్‌టీఆర్‌దేనని పోసాని మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ నుంచి పార్టీని, జెండాను  దొంగిలించాడని.. చివరకు ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడయ్యాడని ధ్వజమెత్తారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని.. సింగిల్‌ సెటిల్‌మెంట్, ఇన్‌స్టాల్‌మెంట్‌ అంటూ రైతు లను బాబు మోసం చేస్తున్నాడన్నారు. నిరుద్యోగ భృతి ఎన్నినెలలకు చెల్లించారు.? ఎంతమందికి చెల్లించారని ప్రశ్నించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top