
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థ్ధిపై మజ్లిస్ పార్టీ ఉత్కంఠకు తెర దించింది. ఆ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డబీర్‌పురా కార్పొరేటర్‌గా ఉన్నారు. మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. నాలుగు స్థానాలకు అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, ఓ స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. ఎంఐఎం సీటుకోసం ఆపార్టీ సీనియర్ నేతలు చాలా మంది పోటీపడ్డారు. చివరికి మీర్జా రియాజ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఒవైసీ ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డిని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Happy to inform that Mirza Riyaz ul Hasan Effendi will be the MLC candidate from AIMIM.
— Asaduddin Owaisi (@asadowaisi) February 25, 2019