ప్రమాదంలో రాజ్యాంగం! | Non-BJP parties unite for ‘Save Constitution’ rally | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో రాజ్యాంగం!

Jan 17 2018 9:01 AM | Updated on Mar 18 2019 9:02 PM

Non-BJP parties unite for ‘Save Constitution’ rally - Sakshi

సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల రాజ్యాంగం సంక్షోభంలో పడిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ జనవని 26న బీజేపీయేతర పక్షాలు, ప్రజాసంఘాలు ముంబైలో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీలో ప్రధానంగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, జనతాదళ్‌ (సెక్యులర్‌), ఆర్జేడీలు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.  

బీజేపీ పాలనతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని స్వాభిమాని శేట్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ రాజు శెట్టి అన్నారు. జనవరి 26న జరగనున్న ర్యాలీకి రాజు చీఫ్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమం అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమవ్వాల్సిన సమయం ఇదేనని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు, సీతారాం ఏచూరీ, డి. రాజా, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌ వంటి నేతలంతా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement