బాలయ్యా...వాట్‌ ఈజ్‌ దిస్‌ అయ్యా..?

Nandamuri Balakrishna once again lost his cool in Vasakhapatnam - Sakshi

విశాఖ సభలో ‘ఏయ్‌..మాట్లాడకు’ అంటూ అభిమానికి బాలకృష్ణ వార్నింగ్‌

జనం లేక వెలవెలబోయిన బహిరంగ సభ

సాక్షి, భీమునిపట్నం : ‘ఏయ్‌ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా..’ అంటూ అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీనటుడు బాలకృష్ణ తాజాగా విశాఖ జిల్లాలోనూ రెచ్చిపోయారు.  ఎన్నికల ప్రచారంలో ఆయన మరోసారి తన అభిమానులపై తన ప్రతాపాన్ని చూపారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో గంటస్తంభం వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బాలయ్య ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ ఒక్కసారిగా తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్‌..మాట్లాడకు’ అని ఓ అభిమానిపై రెండుసార్లు మండిపడ్డారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చేప్పే ప్రయత్నంలో అదే పనిగా మాటల్లో తడబడ్డారు. దీంతో సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు బాలయ్య ప్రసంగం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
చదవండి...(పీక కోస్తా.. కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం)

జనసేన పార్టీని ఉద్దేశించి గ్లాసు బార్‌లో ఉండాలని సైకిల్‌ జనంలో ఉండాలని వ్యాఖ్యానించారు. విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్‌ను, అసెంబ్లీ అభ్యర్థి సబ్బం హరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, శనివారం ఉదయం బాలకృష‍్ణ భీమునిపట్నం వచ్చారు. ఇక్కడ మూడు రోజులుగా గ్రామదేవత నూకాలమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో పక‍్కనే బాలకృష్ణ సభ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. టీడీపీ శ్రేణులు తీసుకువచ్చిన కొద్దిపాటు జనం మాత్రమే సభలో కనిపించారు. 

చదవండి : బాలకృష్ణ మరో నిర్వాకం.!
బాలయ్య హీరోనా... జీరోనా?
బాలకృష్ణ బూతు పురాణం
వైరల్‌: బుల్బుల్బాలయ్య..!
బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top