‘నాన్నఉంటే ఆ మజాయే వేరు.. అన్నారు’ | Manmohan Singh Interesting Comments On Lalu Prasad At Sonias Dinner | Sakshi
Sakshi News home page

‘నాన్నఉంటే ఆ మజాయే వేరు.. అన్నారు’

Mar 14 2018 1:35 PM | Updated on Oct 22 2018 9:16 PM

Manmohan Singh Interesting Comments On Lalu Prasad At Sonias Dinner - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శైలేవేరు! అచ్చమైన భోజ్‌పురీ యాసలో ప్రత్యర్థులపై పంచ్‌లు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టె లాలూ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తుండటంతో అతన్ని మిస్‌ అవుతున్నామని రాజకీయ ప్రముఖుల అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌... సోనియాగాంధీ ఇచ్చిన విందు సందర్భంగా లాలూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమావేశాల్లో లాలూ ఉంటే ఆ మజానే వేరని అన్నారని లాలూ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మీడియాకి తెలిపారు. ఈ సంఘటన మంగళవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విపక్షపార్టీకి ఇచ్చిన విందు కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి  ఆర్జేడీ తరుపున బిహారు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, మీసా భారతి హాజరయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement