breaking news
laalu prasad
-
‘నాన్నఉంటే ఆ మజాయే వేరు.. అన్నారు’
న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ శైలేవేరు! అచ్చమైన భోజ్‌పురీ యాసలో ప్రత్యర్థులపై పంచ్‌లు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టె లాలూ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తుండటంతో అతన్ని మిస్ అవుతున్నామని రాజకీయ ప్రముఖుల అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్... సోనియాగాంధీ ఇచ్చిన విందు సందర్భంగా లాలూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమావేశాల్లో లాలూ ఉంటే ఆ మజానే వేరని అన్నారని లాలూ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మీడియాకి తెలిపారు. ఈ సంఘటన మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విపక్షపార్టీకి ఇచ్చిన విందు కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ తరుపున బిహారు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మీసా భారతి హాజరయ్యారు. -
'బీజేపీ మంటల్లో ఉంది'
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ మంటల్లో ఉందని, ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అన్నారు. ఆ పార్టీలో భూకంపం వస్తుందో లేక అగ్నిపర్వతం బద్ధలవుతుందో ఎవరికీ తెలియదని చెప్పారు. బీహార్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఆ పార్టీ దోబూచులాడుతుందని, కుల రాజకీయాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసినా పెద్దగా ఏం చేయలేకపోయారని ఈసారి కూడా అదే జరగుతుందని చెప్పారు. ఇప్పటికే ఆ పార్టీ నేతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై గుబులు పుట్టుకొచ్చిందని ఆ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కలేదని చెప్పారు. తాను కేవలం ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు అనడం లేదని ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా సొంత ప్రభుత్వంపైనే నమ్మకం లేని మాటలు అన్నారని, దేశంలో అత్యవసర పరిస్థితి కూడా వచ్చే అవకాశముందంటూ ఆయన చేసిన మాటలను గుర్తు చేశారు. కేంద్రలో ఒకే వ్యక్తి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే దేశం మొత్తం తెలుసని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్రమోదీని పరోక్షంగా విమర్శించారు.