హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..! | Kishan Reddy Comments On TRS | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..!

Aug 21 2019 2:54 PM | Updated on Aug 21 2019 5:29 PM

Kishan Reddy Comments On TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అనే వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మారుతుందన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఇది కేంద్ర పరిధిలోకి రాదని పేర్కొన్నారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఏవరో తెలీయదు అనడం మంచి సంస్కృతి కాదని, ఇది అహంకార పూరిత పరిణామమని కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు చురకలంటించారు. నడ్డా ఎవరో తెలియదన్న ఆయన గతంలో నడ్డాను ఎలా కలిశారని ప్రశ్నించారు. తాము కూడా కేటీఆర్‌ ఎవరని అనొచ్చని కానీ అది బీజేపీ సంస్కృతి కాదని తెలిపారు.

ఇక తెలంగాణలో బీజేపీ లేదని కేటీఆర్‌ అనడంపై మండిపడ్డ కిషన్‌ రెడ్డి నిజామాబాద్‌లో కవిత ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు. కేంద్ర పథకం ఆయుష్మాన్‌ భవ.. కేటీఆర్‌ బక్వాస్‌ అనడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ టార్గెట్‌​ మున్సిపల్‌ ఎన్నికలు కాదని, 2023 ఎన‍్నికలని స్పష్టం చేశారు. సుష్మా స్వరాజ్‌ చనిపోతే కనీసం చూడటానికి రాలేని మీరు మాట్లాడుతున్నారా అని టీఆర్‌ఎస్‌ను విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement