రజత్‌కుమార్‌ను కలిసిన కేతిరెడ్డి | Kethireddy Jagadishwar Reddy Meets Rajat kumar | Sakshi
Sakshi News home page

Nov 5 2018 8:52 PM | Updated on Nov 5 2018 8:52 PM

Kethireddy Jagadishwar Reddy Meets Rajat kumar - Sakshi

హైదరాబాద్‌ : తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు మరియు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. మధ్యం తాగి ఓటు వేయకుండా నివారించుటకు బ్రీత్‌ ఎనలైజర్‌లను ఏర్పాటు చేయాలని అందుకు తెలుగు రాష్ట్రమైన తెలంగాణనుంచి శ్రీకారం చుట్టాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ వినతి పత్రానికి స్పందించిన ఎన్నికల ప్రధాన అధికారి కేతిరెడ్డి ప్రయత్నాన్ని హర్షించారు.ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళతానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికే మీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టుద్వారా ఆదేశాలు వస్తే మీ ప్రయత్నం సఫలమవుతుందని అన్నారు.

రజత్‌కుమార్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాలలో బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరాలను ఏర్పాటు చేసి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ఎన్నికల విధానానికి తెలంగాణ శ్రీకారం చుట్టాలని తాను కోరినట్లు చెప్పారు. మధ్య రహిత ఎన్నికల కొరకు న్యాయ పోరాటంతోపాటు ధర్మపోరాటం కూడా తాను చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిషన విధంగానే మిగతా రాష్ట్రాల ఎన్నికల అధికారులను త్వరలోనే కలుస్తానని చెప్పారు. ఓటువేసే ఓటరు మధ్యం సేవించి ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానన్నారు. దేశ భవిష్యత్తు ప్రస్తుతం మత్తులో ఉందని, దానిని నివారించే బాధ్యత పౌరులకు  ఉందని అందుకు సమర శంఖారావం పూరించి మద్యరహిత భారత నిర్మాణం కొరకు మనందరం కృషి చేయాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement