ఓటేసిన భారత తొలి ఓటరు

Independent India First Voter Shyam Saran Negi Cast His Vote - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా నేగికి ఈసీ అపూర్వ స్వాగతం పలికింది. డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతూ పోలింగ్‌ బూత్‌ వరకూ తీసుకొచ్చి దగ్గర ఉండి మరీ ఓటు వేయించారు. ఆయన పోలింగ్ బూత్ కు వచ్చినప్పుడు మిగతా ఓటర్లు కూడా సహకరించారు. ఆయనతో ఫొటోలు దిగారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కల్పా ప్రాంతానికి చెందిన శ్యామ్ సరన్ నేగి ఓ శతాధిక వృద్ధుడు. ఆయన వయసు 102 సంవత్సరాలు. 1951 లోజరిగిన భారత తొలి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన భారతీయుడు శ్యామ్ శరన్ నేగీనే. అందుకే ఆయనను ఈసీ ఓ సెలబ్రెటీలా గౌరవించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top