‘మూడో సర్జికల్‌ దాడి గురించి ఎవరికీ తెలియదు’

Did 3 Airstrikes In 5 Years But Will Not Talk About Third Strike Says Rajnath Singh In Karnataka - Sakshi

కర్ణాటక: భారత వైమానిక దళాలు ఈ ఐదేళ్లలో భారత సరిహద్దు దాటి, పాకిస్తాన్‌లోకి ప్రవేశించి మూడు సార్లు సర్జికల్‌ దాడులు చేశాయని, కానీ అందరికీ రెండు సర్జికల్‌ దాడుల గురించే తెలుసునని , తాను కూడా ఈ రెండు సర్జికల్‌ దాడుల గురించే మాట్లాడతానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాక్యానించారు. శనివారం కర్ణాటకలో జరిగిన బీజేపీ ర్యాలీలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. 2016లో , 2019లో జరిగిన సర్జికల్‌ దాడులు సక్సెస్‌ అయ్యానని పేర్కొన్నారు. బాలాకోట్‌లో ఫిబ్రవరి 14 న జరిగిన సర్జికల్‌ దాడుల్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

యూరీ దాడికి ప్రతీకారంగా 2016లో భారత బలగాలు నియంత్రణ రేఖ వెంబడి జరిపిన సర్జికల్‌ దాడిలో పలువురు ఉగ్రవాదులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత వైమానికి దళాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్‌ దాడులు చేసిన సంగతి తెల్సిందే. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ను వాహనంతో ఢీకొట్టి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది సిబ్బంది, మరో 70 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. బాలాకోట్‌ సర్జికల్‌ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయిందీ భారత వైమానిక దళం అధికారులు అధికారికంగా చెప్పనప్పటికీ బీజేపీ నేతలు మాత్రం సుమారు 250 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు ప్రకటించడం గమనించదగిన విషయం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top