పోటీ చేసిన వారిదే బాధ్యత

Congress Planning To Elect Municipal Candidates For Municipal Elections - Sakshi

గత ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ అభ్యర్థులకే అప్పగింత

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఏ క్షణాన వెలువడినా సిద్ధంగా ఉండేలా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపోటముల భారం ఆ నలుగురికీ అప్పగిస్తూ అంతర్గత సంకేతాలు పంపింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీచేసిన అభ్యర్థులు, జిల్లా, పట్టణ లేదా నగర కాంగ్రెస్‌ అధ్యక్షులకే అన్ని బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తున్నామని, వీలైనంత త్వరగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వార్డుకు పది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ విధానంలోనే.. 
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించిన సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ విధానంలోనే మున్సిపల్‌ అభ్యర్థులను ఎంపిక చేయాలని గతంలోనే కాంగ్రెస్‌ నిర్ణయించింది. మున్సిపల్‌ ఎన్నికల కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నోటిఫికేషన్‌ త్వరలోనే వస్తుందనే అంచనాతో క్షేత్రస్థాయి కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది. మరో వారం రోజుల్లో టీపీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, జిల్లా, పట్టణ, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నా రని పార్టీ వర్గాలు తెలిపాయి.  ‘మున్సిపల్‌ ఎన్నికల విషయంలో మేం అన్ని పార్టీల కన్నా ఓ అడుగు ముందే ఉన్నాం. ఇప్పటికే జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులకు సందేశాలు పంపాం’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top