‘టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం’

Chandra kumar commented over trs - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన అభివృద్ధి శూన్యమని తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. ప్రగతి నివేదన సభ ఎందుకు ఏర్పాటు చేశారో, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారో ఎవరికీ అర్థం కాని రీతిన సభను నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభలో మద్యం ఏరులై పారిందన్నారు. సభలో సీఎం కేసీఆర్‌ ఏవో హామీలు ఇస్తారని ఆశించిన నిరుద్యోగ యువతకు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించే హామీలు ఇవ్వకపోవడం విచారకరమని తెలిపారు.

మంగళవారం నల్లకుంటలోని పార్టీ కార్యాలయంలో చంద్రకుమార్‌ మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందించి రైతు ఆత్మహత్యలను నివారించలేని దయనీయ స్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సహాయం చేయడంతో రైతుల సమస్యలు తీరవని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top