ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు కానీ..

Central Government Declares Special Status Continue On 11 states - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గతంలో ఉన్న ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు లేవని కేంద్రం స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గతంలో హోదా ఉన్న రాష్ట్రాలకు ఇప్పుడు హోదా పేరు లేదు కానీ అవే ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాలయ రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని కేంద్రం తెలిపింది.

అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుతో ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తొలగించామని కానీ హోదాతో వచ్చే ఆర్థిక సహాయం మాత్రం అందజేస్తుమని సమాధానమిచ్చారు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రయోజిత పథకాలలో హోదా కలిగిన 11 రాష్ట్రాలకు 90:10 ప్రకారం నిధులు అందుతున్నాయని సమాధానమిచ్చింది. 

విదేశీ సహాయ ప్రాజెక్టులు(ఈఏపీ) కింద వచ్చే నిధులను 90శాతం ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ రాష్ట్రాలకు గ్రాంటుగా అందజేస్తున్నట్లు స్ఫష్టం చేసింది. ఏపీకి ఐదేళ్లకుగాను రెవెన్యూ లోటు  భర్తీకి గ్రాంట్ గా 22 వేల 112 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ అభివృద్ధి మండలి ద్వారా మంజూరయ్యే స్పెషల్‌ స్టేటస్‌లో ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఉండవని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top