23, 24 తేదీల్లో విజయోత్సవాలు

BJP decided to organize 23 and 24 triumphs - Sakshi

నిర్వహించనున్న బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌: గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌బూత్, మండల, జిల్లాస్థాయిల్లో పెద్దఎత్తున విజయోత్సవాలు నిర్వ హించాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం (24న) ఉదయం 10కి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో భారీస్థాయిలో గెలుపు ఉత్సవాలను నిర్వహించాలని భావిస్తోంది. మంగళ వారం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. గురువారం ఓట్ల లెక్కింపులో ఆలస్యం జరిగే అవకాశాలున్నందున, తదనుగుణంగా బూత్‌స్థాయి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పార్టీలకు సూచించినట్టు సమాచారం.  

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఎంపీటీసీ, ఇతర స్థానిక సంస్థల సభ్యులంతా ఏవైపూ మొగ్గుచూపకుండా తటస్థంగా వ్యవహరించేలా చూడాలని పార్టీ భావిస్తోంది. మంగళవారం జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమావేశంలో, జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీపరంగా ఎలాంటి చర్యలు చేపడితే బావుం టుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా పార్టీ తరఫున ఎన్నికయ్యే పరిషత్‌ సభ్యులు, పార్టీపరంగా ఎంపీపీ అధ్యక్ష స్థానాలు గెలిచే అవకాశమున్న చోట ఇతర పార్టీలు అందించే సహకారాన్ని బట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి మద్దతి వ్వాలనే ఆలోచనతో పార్టీ నాయకులున్నట్టు సమాచారం. జూలై మొదటివారంతో పదవీకాలం ముగుస్తు న్న రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి 51 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు కౌన్సిలర్లున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top