
సాక్షి, ప్రత్తిపాడు/తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు.ఇప్పటి వరకు ఆయన 2685 కిలోమీటర్లు నడిచారు.