Sakshi News home page

తెలంగాణ కవుల గానం

Published Sun, Jul 26 2015 12:21 AM

తెలంగాణ కవుల గానం

పుస్తక పరిచయం
 
ఉగాది రోజు మన ఇంటిలో కనిపించే పండుగ కళ ఏదో ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు కలుగుతుంది. మామూలుగానైతే సాంస్కృతిక శాఖ నుంచి ఉత్పత్తి అయ్యే సాహిత్యం మనసుకు తీసుకోవాల్సినంత బరువుగా ఉండదు. కానీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ స్వయంగా కవి కావడం వల్ల, సంపాదకత్వం వహించడం వల్ల ఈ 200 పేజీల పుస్తకానికి ఒకింత నిండుదనం వచ్చింది. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన తొలి కవిసమ్మేళనంలోని 60 కవితలు ఇందులో ఉన్నాయి.

‘మీరక్కడ అనంత నిరాహారదీక్షలో ఉండండి/ నేను మీకోసం అంతర్‌సుందర సద్దగట్క వండుతుంటాను’ అంటాడు దెంచనాల శ్రీనివాస్. సామిడి జగన్‌రెడ్డి ‘ముసాఫిర్లకు చార్‌కమానై దునియాకే కోహినూరై/మా నాజూకు పనితనానికి నఖల్‌గా నిలిచి’నదంటూ హైదరాబాద్‌ను కీర్తిస్తాడు. అయితే, ‘నా బాధ ప్రపంచ బాధ’ కోవకు చెందినవాటికంటే తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక స్పృహకు చెందిన కవితలకే ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది.

పాషా
కొత్తసాలు (మన్మథ నామ ఉగాది-ప్రపంచ కవితా దినోత్సవ కవితా సంకలనం); ప్రతులకు: డెరైక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్.

Advertisement
Advertisement