దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా పేదలే కాదు మధ్య తరగతి ప్రజలకు సైతం బతుకు బరువుగా మారుతోంది. కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, మధ్యదళారులు, బడావర్తకులు చేస్తున్న నిలు వు దోపిడీకి కళ్లెం వేయకపోవడం వల్లనే ఆహార ధరలు చుక్క లు చూపిస్తున్నాయనేది తిరుగులేని వాస్తవం. రానున్న రోజులన్నీ పండుగలు, పర్వదినాలే. వినాయక చవితి మొద లు దసరా, దీపావళి.. వరుసగా వచ్చే పండుగలను తలచుకుంటేనే గుండె గుభేలు మంటోంది. సమాజం లోని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగల సందడిని కొండెక్కిన ధరలు ముందే నీరు కార్చేస్తు న్నాయి.
సాధారణ ప్రజలు ఆ కొద్దిపాటి సంతోషానికి కూడా దూరం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మేలు కొని ప్రతి పండుగకు కనీసం తెల్లకార్డుదారులకైనా సబ్సిడీ ధరలకు అదనంగా ఒక్కొక్క కిలో చక్కెర, గోధుమ, కంది, మినప, పెసరపప్పులను, వంటనూనెలను పంపిణీ చేయా లి. ఏదిఏమైనా నిత్యజీవితావసరాల ధరలను తగ్గేలా చేయ డం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని గుర్తించాలి.
- రఘుముద్రి అప్పలనరసమ్మ
బాలిగాం, శ్రీకాకుళం జిల్లా


