మిస్సోరిలో జగన్‌ కోసం మనం | Prajasankalpa yatra completion celebrations in Saint Louis | Sakshi
Sakshi News home page

మిస్సోరిలో జగన్‌ కోసం మనం

Feb 10 2019 1:30 PM | Updated on Feb 10 2019 1:51 PM

Prajasankalpa yatra completion celebrations in Saint Louis - Sakshi

మిస్సోరి : ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మిస్సోరి ఆధ్వర్యంలో జనం కోసం జగన్‌.. జగన్‌ కోసం మనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ 3648కిలోమీటర్ల దూరం నడిచి ఓ చరిత్రను సృష్టించారని ఎన్‌ఆర్‌ఐలు అన్నారు. 


ఈ కార్యక్రమంలో సెయింట్‌ టూయిస్‌లోని వైఎస్‌ జగన్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కోన రఘుపతి, బాలరాజు పోలవరం, కాటం రెడ్డి శ్రీధర్‌, అన్నబత్తిన శివకుమార్‌, తోపుర్తి ప్రకాశ్‌ రెడ్డి, ఆదిములపు సురేష్‌, దువ్వాడ శ్రీనివాస్‌ తమ సందేశాన్ని వీడియో తీసి పంపించారు.  కావాలి జగన్‌ రావాలి జగన్‌ నినాదాలతో సభాప్రాంగణం మారుమోగిపోయింది. యాత్ర చిత్ర పాటలకి చిన్నారులు డ్యాన్స్‌ వేశారు. 

సెయింట్‌ లూయిస్‌, మిస్సోరి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు నవీన్‌ గుడవల్లి, వెఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ సెంట్రల్‌ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి పమ్మి, వెఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ సెంట్రల్‌ కమిటీ సభ్యులు గోపాల్‌ రెడ్డి తాటిపత్రి, రంగా చక్క ట్రెజరర్‌, విజయ్‌ బైక, హరి తోటపల్లి, రామక్రిష్ణా బోరెడ్డి, రాజేంద్ర ఎమ్‌, యుగేందర్‌ తలాటి, సుధాకర్‌ రెడ్డి, రమేష్‌ కొరప్రోలు, సుబ్బారెడ్డి  తాటిపత్రిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement