ఆన్‌లైన్‌లో ‘అన్నమయ్య శతగళార్చన’

Annamaiah Shatha galarchana conducted in online due to corona virus - Sakshi

సింగపూర్ : సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో మూడవ "అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు" ఘనంగా జరిగాయి. 5 దేశాలనుండి 17మంది కళాకారులతో 200 మందికి పైగా లైవ్ ప్రేక్షకులతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవిడ్‌-19 వైరస్‌ దృష్ట్యా ఈసారి సమ్మేళనాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఇండియా, దుబాయ్, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలనుండి తెలుగు వారందరు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
                                                                                                              
ఈ 2020 శతగళార్చన కార్యక్రమం 200మందికిపైగా భక్తి తత్వసాధకుల భాగస్వామ్యంతో జూమ్‌ యాప్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రసారం చేశారు. 100మందికి పైగా పిల్లలు పంపిన అన్నమయ్య కీర్తనల నుండి, 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. చిన్నారులు తమ మధురమైన కీర్తనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ప్రముఖ వయొలినిస్ట్, స్వరకర్త డా. జ్యోత్స్నా శ్రీకాంత్ తమదైన శైలిలో "బ్రహ్మమొక్కటే” కీర్తనను వయోలిన్‌పై ప్రదర్శించి అందరినీ అలరించారు.
  
ఊలపల్లి సాంబశివ రావు, వాణి ప్రభాకరి, డా.జ్యోత్స్నా శ్రీకాంత్, కవుటూరు రత్నకుమార్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్న, చివుకుల సురేష్, భాగవతుల రవితేజ, ఇతర స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం సంకలనం చేశామని అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్, విద్యాధరి దంపతులు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top