తన వదినపై గొడ్డలితో దాడిచేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ ప్రాంతంలో సమీపంలోని బన్పూర్ వద్ద జరిగింది.
తన వదినపై గొడ్డలితో దాడిచేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ ప్రాంతంలో సమీపంలోని బన్పూర్ వద్ద జరిగింది. రామ్ సహాయ్ (22)కి అతడి వదిన సరోజ్ (24)తో శుక్రవారం నాడు గొడవ జరిగింది. దాంతో అతడు ఆమెపై గొడ్డలితో డాది చేశాడని జిల్లా ఎస్పీ విజయ్ యాదవ్ తెలిపారు.
తర్వాత ఏం జరుగుతుందోనన్న భయంతో అతడు ఏదో విష పదార్థం తీసుకుని, ఆ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు. రామ్ సహాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా అక్కడ అతడు మరణించినట్లు ఎస్పీ తెలిపారు. అతడి చేతిలో తీవ్రంగా గాయపడిన సరోజ్ను తొలుత జిల్లా ఆస్పత్రిలో చేర్చి, తర్వాత అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఝాన్సీకి తరలించారు.