ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడు | Youth arrested for posting ex-girlfriend's nude pictures | Sakshi
Sakshi News home page

ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడు

Jun 28 2015 3:31 PM | Updated on Jul 27 2018 12:33 PM

ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడు - Sakshi

ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడు

ఫేస్బుక్లో మాజీ స్నేహితురాలి నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన త్రిపురకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అగర్తలా: ఫేస్బుక్లో మాజీ స్నేహితురాలి నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన త్రిపురకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

త్రిపురకు చెందిన అరూప్ దేవ్ అనే యువకుడికి పశ్చిమబెంగాల్లోని మల్దా జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత దేవ్ ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో ఆమె నిరాకరించింది. ద్వేషం పెంచుకున్న దేవ్ ఆమె నగ్న చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై యువతి తల్లిడండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు త్రిపురలో దేవ్ను అరెస్ట్ చేసి కోల్కతాకు తీసుకెళ్లారు.  అరూప్ కు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ను సీజ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement