మహిళ పేరుతో ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచి.. | Youth arrested for creating fake FB profile of woman | Sakshi
Sakshi News home page

మహిళ పేరుతో ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచి..

Feb 2 2016 9:23 AM | Updated on Sep 3 2017 4:49 PM

ఓ మహిళ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఆ పేజీలో నగ్న చిత్రాలు, అశ్లీల సాహిత్యాన్ని పోస్ట్ చేసిన నిందితుడి (23)ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్కతా: ఓ మహిళ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఆ పేజీలో నగ్న చిత్రాలు, అశ్లీల సాహిత్యాన్ని పోస్ట్ చేసిన నిందితుడి (23)ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

సయంతన్ సర్కార్ అనే యువకుడు కోల్కతాకు చెందిన ఓ మధ్య వయస్కురాలు పేరుతో ఫేస్బుక్లో నకీలీ ఎకౌంట్ తెరిచాడు. ప్రొఫైల్లో ఆమె ఫొటోలు ఉంచాడు. ఈ ఫేస్బుక్ పేజీలో నగ్నచిత్రాలు, అశ్లీల సాహితాన్ని, పోర్న్ వెబ్సైట్ల లింక్లను పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై 354, 509 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement