బాధితురాలి న్యాయవాదికి రూ.5లక్షల పరిహారం

Unnao Case SC Asks CBI to Complete Investigation in 2 Weeks - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కారు ప్రమాద కేసును సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. అంతేకాక ప్రమాదంలో గాయపడిన బాధితురాలి న్యాయవాదికి తక్షణమే రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యాచార ఘటనతో పాటు రోడ్డు ప్రమాదం కేసుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది.

బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ కోర్టుకు వివరించింది. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు వారాలు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top