కుల్గమ్‌ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం | Two hizbul Terrorists Killed in Kulgam encounter | Sakshi
Sakshi News home page

కుల్గమ్‌ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Sep 11 2017 8:20 AM | Updated on Sep 19 2017 4:22 PM

జమ్ము కశ్మీర్‌ సరిహద్దులో భద్రతా దళాలు మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. కుల్గమ్‌ ప్రాంత

సాక్షి, కుల్గమ్‌: జమ్ము కశ్మీర్‌ సరిహద్దులో భద్రతా దళాలు మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. కుల్గమ్‌ ప్రాంతంలో గత అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాద్రులను మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
 
కుల్గమ్‌ జిల్లాలోని కుద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్చన్‌ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగాయి. దీంతో ప్రతిదాడికి దిగిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. మృతులు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చెందిన దావూద్‌ అహ్మద్‌ అలీ, షయియార్‌ అహ్మద్‌ వానీగా గుర్తించారు. అరెస్టయిన అరీఫ్ సోఫీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి. ఉగ్రవాద శిబిరం నుంచి ఓ AK-47, ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ తుపాకులను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement