ఏం జరిగిందో..? | The girl died in a suspicious | Sakshi
Sakshi News home page

ఏం జరిగిందో..?

Sep 3 2017 10:40 AM | Updated on Sep 28 2018 3:41 PM

ఏం జరిగిందో..? - Sakshi

ఏం జరిగిందో..?

రాయగడ మజ్జిగౌరి మందిరం, బ్రిడ్జి మధ్య రైలుపట్టాల పక్కన శుక్రవారం రాత్రి ఒక యువతి మృతదేహాన్ని రాయగడ పోలీసులు గుర్తించారు.

► అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
► రైలు పట్టాలపై మృతదేహం
► జీఆర్‌పీ పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
► హత్యచేశారని మృతురాలి తండ్రి ఆరోపణ
 
రాయగడ(ఒడిశా): రాయగడ మజ్జిగౌరి మందిరం, బ్రిడ్జి మధ్య రైలుపట్టాల పక్కన శుక్రవారం రాత్రి ఒక యువతి మృతదేహాన్ని రాయగడ పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువతిని హత్య చేశారా? ఆత్మహత్యకు పాల్పడిందా? ప్రమాదవశాత్తు మృతి చెందిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   రాయగడ జిల్లా బిసంకటక్‌ సమితి బారిగుడ గ్రామంలోని సరస్వతి శిశుమందిర్‌లో పనిచేస్తున్న గౌరిచంద్రసున్నాముద్ది, భారతిసున్నాముద్ది (అంగన్‌వాడీ వర్కర్‌) దంపతులు. వారి కుమార్తె లిప్సరాణిసున్నాముద్ది. లిప్సరాణి రాయగడ ఆటానమస్‌ కాలేజీలో ప్లస్‌–3 సైన్స్‌ మొదటి సంవత్సరం చదువుతూ రాయగడలోని రాణిగుడఫారంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.  శుక్రవారం సాయంత్రం లిప్సరాణి కంప్యూటర్‌శిక్షణకు వెళ్తూ పాఠ్యపుస్తకాలు ఇచ్చి రావడం ఆలస్యమవుతుందని ఇంట్లో చెప్పి వెళ్లింది. 
 
తరువాత  రాత్రి 7.30గంటల సమయంలో షేక్‌సమీర్‌ అనే వ్యక్తి (8249036427) బిసంకటక్‌లో ఉన్న లిప్సరాణి తల్లి భారతిసున్నాముద్దికి ఫోన్‌ చేసి ఇంట్లో మీ అమ్మాయి ఉందా? అని అడిగాడు. దీనికి తల్లి భారతి మాట్లాడుతూ ఇంట్లో అమ్మాయి లేదు.  వాళ్ల అమ్మమ్మ వద్ద ఉంది అని చెప్పింది. అదే వ్యక్తి మళ్లీ  ఫోన్‌ చేసి  లిప్సరాణి సునీల్‌ మహంతి అనే అబ్బాయితో ఒక గదిలో ఉందని   చెప్పాడు. ఇలా 8సార్లు ఫోన్‌చేసి లిప్సరాణి ఇంట్లో వారికి చెప్పి  ఆఖరి ఫోన్‌లో లిప్సరాణి సైకిల్‌ మజ్జగౌరిమందిరం వద్ద ఉందని  ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన వచ్చి మందిరం ఆవరణలో వెతకగా సైకిల్, ఆమె పుస్తకాల దగ్గర రక్తపు మరకలతో లిప్సరాణి పడి ఉంది. తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. ఇదిలాఉండగా 5గురు యువకులతో కలిసి లిప్సరాణి మందిరం నుంచి వెళ్తున్నట్లు మందిర ఆవరణలో భిక్షకులు చూసి చెప్పినట్లు తెలియవచ్చింది. 
 
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తేనే..?
సునీల్‌మహంతి అనే అబ్బాయిని లిప్సరాణి ప్రేమిస్తోంది. సునీల్‌తో  పాటు అతని స్నేహితులు షేక్‌సమీర్, బిపిన్‌బెహరా, నితిష్‌భౌద్య, సత్యనారాయణదాస్, వినోద్‌కుమార్‌ అనే వ్యక్తులతో కలిసి మజ్జిగౌరి మందిరం వద్ద లిప్సరాణి ఘర్షణ పడగా ఆమెను  ఆరుగురు యువకులు కొట్టి చంపి తరువాత రైలున్‌ పట్టాలపై  ప్రణాళిక ప్రకారం పడవేసి ఏమీ తెలియనట్లు వారి ఇంటికి ఫోన్‌  చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపిస్తూ లిప్సరాణి కుటుంబసభ్యులు శనివారం   జీఆర్‌పీ పోలీసులు, మీడియాకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీస్‌ ఐఐసీ లోకనాథ్‌సాహు ముందుగా ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించి మృతదేహాన్ని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారణంగా ఫిర్యాదు తీసుకోవడం లేదని చెప్పారు.

మృతిచెందిన లిప్సరాణి కుటుంబీకులు మీడియా ద్వారా రైల్వేఎస్పీకి తెలియచేయగా ఎస్పీ ఆదేశాల ప్రకారం రైల్వే పోలీసులు  కేసు నమోదు చేశారు. అనంతరం లిప్సరాణి తల్లిదండ్రులు టౌన్‌పోలీస్‌ స్టేషన్‌లో ఐఐసీ ఆర్‌.కె.పాత్రోకు ఫిర్యాదు చేశారు.  దీంతో టౌన్‌పోలీసులు షేక్‌సమీర్, సునీల్‌మహంతి, బిపిన్‌బెహరాలను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులు తమతో పాటు మరో ముగ్గురు యువకులు సంఘటన సమయంలో ఉన్నారని  తెలియజేశారు. దీంతో అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులను,  ఫిర్యాదును టౌన్‌ పోలీసులు  రైల్వే పోలీసులకు బదలాయించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత ఇది హత్యా? ప్రమాదమా? ఆత్మహత్యా? అన్నది తెలుస్తుందని రైల్వే పోలీస్‌ అధికారి లోకనాథ్‌సాహు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement