ఫేస్‌బుక్‌ అప్‌డేట్‌తో దొరికిపోయాడు

Teenager Reunited With Family 3 years After He Updates Facebook Account - Sakshi

బెంగళూరు: దైనందిన జీవితాల్లో సోషల్‌ మీడియా పెనవేసుకుపోయిన వైనాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చిన ఉదంతమిది. మూడేళ్ల క్రితం క్షణికావేశంతో ఇంటినుంచి పారిపోయిన టీనేజ్‌ బాలుడిని అనూహ్యంగా  ఫేస్‌బుక్‌ మళ్లీ కుటుంబంతో కలిపింది. 

వివరాల్లోకి వెళితే  ఆశిష్‌ విచారే (19) 2016లో తల్లిమీద కోపంతో ఇంటినుంచి పారిపోయాడు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో చదుకోవడంలేదంటూ  తల్లి మందలించడంతో  అలిగి  ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీనిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతని ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు. చివరికి మూడేళ్ల  తరువాత ఈ మిస్సింగ్‌ కేసును ఛేదించారు. అదీ ఫేస్‌బుక్‌ ద్వారా.  

ఈ నెలలో (ఫిబ్రవరి) ఆశిష్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాను అప్‌డేట్‌ చేశాడు. అంతేకాదు ఒక ఫోటోను కూడా పోస్ట్‌ చేశాడు. దీంతో ఆశిష్‌  వివరాలను పసిగట్టడం పోలీసులు ఈజీ అయింది.  ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని అతని ఫోన్‌ నంబరు ఆధారంగా ఎట్టకేలకు అతని ఆచూకిని కనిపెట్టి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కాగా మూడేళ్లు  మిరాజ్‌ రైల్వే స్టేషన్‌లో టీ,కాఫీలు, నీళ్ల  బాటిల్స్‌ అమ్ముకుంటూ జీవనం సాగిచాడట.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top