చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా | talked to chandra babu and discussed, says narendra modi | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా

Jul 14 2015 5:18 PM | Updated on Aug 15 2018 2:20 PM

చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా - Sakshi

చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలిపారు. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడానని, పరిస్థితిపై ఆయనతో చర్చించానని తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పుష్కరాల ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వాళ్ల కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కూడా మృతుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని, అలాగే క్షతగాత్రులకు వైద్య సాయం అందించేందుకు సాధ్యమైనంత కృషి చేయాలని ఆయన సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement