సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి! | RSS office bomb attacked in Kerala and few workers injured | Sakshi
Sakshi News home page

సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!

Mar 3 2017 12:26 AM | Updated on Sep 5 2017 5:01 AM

సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!

సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!

కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు.

కొచ్చి: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళ్లాచీలో గురువారం రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం.

సీఎం విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బాంబు దాడి కచ్చితంగా సీపీఎం కార్యకర్తల పనే అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement