మోదీని నిద్రపోనివ్వను.. | Rahul Gandhi Accused PM Modi Of Creating Two Indias | Sakshi
Sakshi News home page

మోదీని నిద్రపోనివ్వను..

Dec 18 2018 1:34 PM | Updated on Dec 18 2018 6:38 PM

Rahul Gandhi Accused PM Modi Of Creating Two Indias - Sakshi

అప్పటివరకూ మోదీని నిద్రపోనివ్వను..

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు ఊరట కల్పించేవరకూ ప్రధాని నరేంద్ర మోదీని వెంటాడతానని, ఆయనను నిద్రపోనివ్వనని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులకు రుణ మాఫీ ప్రకటించాయని, రాజస్ధాన్‌ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని రాహుల్‌ పేర్కొన్నారు.

ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాల తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఇటీవల రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు గంటల్లోనే రైతు రుణాల మాఫీ ప్రకటించిందని, మూడో రాష్ట్రంలో కూడా రుణమాఫీకి కసరత్తు సాగుతోందన్నారు. రైతు రుణాల మాఫీ దిశగా ప్రధాని చర్యలు తీసుకునే వరకూ తాము ప్రధాని మోదీని విశ్రాం‍తి తీసుకోనీయమని రాహుల్‌ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విడగొట్టారని, ఒక భారత్‌లో రైతులు, పేదలు, యువత, చిన్న వ్యాపారులుండగా, మరో భారత్‌లో కేవలం దేశంలోని పదిహేను మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలున్నారని ధ్వజమెత్తారు. ఇటీవలి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సామాన ప్రజలతో కూడిన భారతీయులు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement