క్విక్‌ రియాక‍్షన్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం | Quick Reaction Surface-to-Air Missile successfully test fired | Sakshi
Sakshi News home page

క్విక్‌ రియాక‍్షన్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

Jul 3 2017 8:09 PM | Updated on Sep 5 2017 3:06 PM

భూతలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అధునాతన క్షిపణ ప్రయోగం విజయవంతమైంది.

భువనేశ్వర్‌(ఒడిశా): భూతలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అధునాతన క్షిపణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి క్విక్‌ రియాక‌్షన్‌ క్షిపణిని సోమవారం ఉదయం 11 గంటలకు డీఆర్‌డీవో నిపుణులు ప్రయోగించారు.

నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి చేరుకోవటంతో ప్రయోగం విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. దీనికి 20-30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యముందని తెలిపారు. ఈ అధునాతన క్షిపణిని ప్రయోగించి చూడటం ఇది రెండోసారి. జూన్‌ 4వ తేదీన మొదటిసారి ప్రయోగించి చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement