'కూంబింగ్ పేరుతో భయపెడుతున్నారు' | professor gn saibaba demand probe on AOB Encounter | Sakshi
Sakshi News home page

'కూంబింగ్ పేరుతో భయపెడుతున్నారు'

Nov 2 2016 2:06 PM | Updated on Mar 28 2019 5:07 PM

కూంబింగ్ పేరుతో గిరిజనులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సాయిబాబా ఆరోపించారు.

న్యూఢిల్లీ: పోలీసులు అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు.

ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చూస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ప్రజాసంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవోబీ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూంబింగ్ పేరుతో గిరిజనులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement