
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను సైనిక బలగాల మధ్య జరుపుకుంటారని సమాచారం. రెండు మూడు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను సందర్శించే ప్రధాని దివాళీ వేడుకలను అక్కడే సైనిక దళాలతో జరుపుకుంటారని తెలిసింది. చైనా సరిహద్దులో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), భారత సైనిక దళాలతో కలిసి . ప్రధాని మోదీ ఈసారి దివాళీ వేడుకల్లో పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దివాళీ వేడుకల అనంతరం మరుసటి రోజు ప్రధాని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి టెంపుల ప్రహరీ గోడ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 2013 తరహాలో ఆలయాన్ని వరదలు ముంచెత్తకుండా ప్రొటెక్షన్ వాల్‌ను నిర్మించిన విషయం తెలసిందే.అయితే ప్రధాని పర్యటనపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని కేథార్‌నాథ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.