ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాజ్యసభను కుదిపేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ వెంటనే ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాజ్యసభను కుదిపేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ వెంటనే ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని వారు గుర్తు చేశారు. రెండేళ్లయినా ప్రత్యేక హోదా కల్పించలేదని నిరసిస్తూ ఆందోళనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక హోదా అని తాము అంటే పదేళ్లు అని వెంకయ్యనాయుడు అన్నారని, దానిని అరుణ్ జైట్లీ కూడా సమర్థించారని కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారని, వారి ఆశలపై నీళ్లు చల్లొద్దని కాంగ్రెస్ ఎంపీ రామచంద్ర రావు అన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా మద్దతు తెలిపారని చెప్పారు.