మీరు తరచుగా ఫారెన్ టూర్ లకు వెళ్తుంటారా? అక్కడి టూరిస్ట్ స్పాట్ లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు తెలియజేస్తుంటారా?
ముంబై: మీరు తరచుగా ఫారెన్ టూర్ లకు వెళ్తుంటారా? అక్కడి టూరిస్ట్ స్పాట్ లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు తెలియజేస్తుంటారా? అయితే, ఇక నుంచి మీ ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడంలో జాగ్రత్త వహించండి. ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఎక్కవగా విదేశాలకు వెళ్లే వారి పన్ను చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. విదేశాలకు వెళ్లే వారి ట్యాక్స్ చెల్లింపుల వివరాల కోసం వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఐటీ శాఖ తనిఖీ చేయాలనే ఆలోచనలో ఉంది.
అయితే, ఈ విషయం పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీడీటీ)దే తుది నిర్ణయం కానుంది. ఈ అంశం స్పందించిన ఆదాయపు పన్నుశాఖ అధికారి ఒకరు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం కొన్ని సందర్భాలలో సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది పన్ను చెల్లింపుదారుడిని వేధించడం కాదనీ.. దీని ముఖ్య ఉద్దేశం వ్యక్తి సంపదను తెలుసుకోవడానికేనని చెప్పారు.