కాంగ్రెస్ జెనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్లించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. పరిశ్రమలకు ఒక వైపు చేయూతనిస్తూనే మరో వైపు అణగారిన వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్సించాలి
Apr 14 2016 7:13 PM | Updated on Sep 3 2017 9:55 PM
హైదరాబాద్: కాంగ్రెస్ జెనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్లించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. పరిశ్రమలకు ఒక వైపు చేయూతనిస్తూనే మరో వైపు అణగారిన వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పిస్తే త్వరగా అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు తమ యూపీఏ ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకున్న విషయాన్ని ఈసందర్భంగా దిగ్విజయ్ గుర్తు చేశారు.రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారదర్శకత విషయంలో రాజకీయ పార్టీలకు మినహాయింపులు ఉండాల్సిన అవసరం లేదని స్పంష్టం చేశారు.
Advertisement
Advertisement