లోక్‌సభ ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖులు వీరే!

Lok Sabha Election 2019 Celebrity Voters - Sakshi

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలనుంచే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలను చేరుకోవటం ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా, బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ, ఇంటర్నేషనల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, సీపీఐ బెగుసరయ్‌ ఎంపీ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌.

ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ పరేశ్‌ రావల్‌ దంపతులు, బీజేపీ మధుర ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆమె కూతుర్లు ఈషా డియోల్‌, అహనా డియోల్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌రావ్‌,  సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌, బాలీవుడ్‌ తారలు అజయ్‌ దేవ్‌గణ్‌, కాజల్‌ దంపతులు, అనుపమ్‌ ఖేర్‌, ప్రియాదత్‌ గేయ రచయిత గుల్జర్‌, మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీం‍ద్ర, నటి కంగనా రనౌత్‌, రేసుగుర్రం ఫేమ్‌ రవి కిషన్‌, టైగర్‌ శ్రాఫ్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top