మింటూ.. మామూలోడు కాదు! | Khalistani terrorist Harminder Singh Mintoo made several phone calls to Pakistan from Nabha jail, says probe | Sakshi
Sakshi News home page

మింటూ.. మామూలోడు కాదు!

Nov 29 2016 3:00 PM | Updated on Sep 4 2017 9:27 PM

మింటూ.. మామూలోడు కాదు!

మింటూ.. మామూలోడు కాదు!

ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.

చండీగఢ్: పంజాబ్‌ లోని నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. నభా జైలులో ఉండగా అతడు పాకిస్థాన్‌ కు ఫోన్లు చేసినట్టు విచారణలో వెల్లడైంది. అతడు పాకిస్థాన్‌ లో ఎవరికి ఫోన్‌ చేశాడనే దానిపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతు​న్నారు. ఫోన్‌ కాల్‌ వివరాలు పరిశీలిస్తున్నారు.

ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరులు, ఐఎస్‌ఐ అధికారులతో మింటూ మాట్లాడినట్టు అనుమానిస్తున్నారు. ఐఎస్‌ఐ సహకారంతో మింటూ ఆగ్నేయాసియా, ఐరోపాలో తన కార్యకలాపాలు విస్తరించినట్టు భావిస్తున్నారు. అతడిని అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు.

నభా జైలు నుంచి తప్పించుకుని పట్టుబడ్డ అతడి దగ్గర కొంత డబ్బు దొరికింది. ఈ నగదు అతడికి ఎవరు ఇచ్చారో కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement