ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ! | Kashmir minister's guard flees with two AK-47 rifles | Sakshi
Sakshi News home page

ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ!

Mar 28 2015 8:28 PM | Updated on Jun 4 2019 6:41 PM

ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ! - Sakshi

ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ!

మంత్రులు రక్షణగా ఉండాల్సిన గార్డులే చోర కళావతారం ఎత్తితే ఇక చేసేదేముంది. కశ్మీర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీనగర్:మంత్రులకు రక్షణగా ఉండాల్సిన గార్డులే చోర కళావతారం ఎత్తితే ఇక చేసేదేముంది. కశ్మీర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రజా పనుల మంత్రిగా పని చేస్తున్న సయ్యద్ అల్తాఫ్ వద్ద నిసార్ అహ్మద్ అనే కానిస్టేబుల్ పర్సనల్ సెక్యూరిటీ గార్డుగా నియమితుడయ్యాడు. గత కొంత కాలంగా మంత్రి  వద్ద విధులు బాగానే నిర్వహిస్తున్న అహ్మద్  తన వద్ద నున్న రైఫిల్స్ ను అపహరించాలని భావించాడు.

 

ముందస్తు ప్రణాళికలో భాగంగా శనివారం కూడా యథావిధిగా డ్యూటీకి వచ్చాడు. ఈక్రమంలోనే రెండు ఏకే 47  రైఫిల్స్ ను దొంగిలించి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement