గుజరాత్‌ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్‌ | Justice Vikram Nath appointed Chief Justice of Gujarat High Court | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్‌

Sep 9 2019 8:19 AM | Updated on Sep 9 2019 8:19 AM

Justice Vikram Nath appointed Chief Justice of Gujarat High Court - Sakshi

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విక్రమ్‌నాథ్‌ అలహాబాద్‌ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది. అయితే ఈ నియామకానికి మోకాలడ్డిన కేంద్రం ఆయన పేరును తిప్పిపంపింది. దీంతో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీంతో కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గుజరాత్‌ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి దాదాపు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement