
జెఈఈ మెయిన్స్ దరఖాస్తులకు గడువు పొడగింపు
జాయింట్ ఎంట్రెన్స్ ఎక్సామినేషన్ (జేఈఈ) మెయిన్- 2017 కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడగించారు.
హైదరాబాద్
జాయింట్ ఎంట్రెన్స్ ఎక్సామినేషన్ (జేఈఈ) మెయిన్- 2017 కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడగించారు. ఈ మేరకు సీబీఎస్ఈ ప్రకటన జారీ చేసింది. ఆన్ లైన్ లో జేఈఈ మెయిన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువును జనవరి 16 వ తేదీ వరకు పొడగించారు. జనవరి 16 వ తేదీ రాత్రి 11.59 నిమిషాల సమయం లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 17 వ తేదీ రాత్రి 11.59 సమయంలోపు ఆన్ లైన్ లో తమ ఫీజును చెల్లించవచ్చని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలియజేసింది.
జేఈఈ మెయిన్స్ ఆన్ లైన్ పరీక్ష ఏప్రిల్ 2 న నిర్వహించే విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ పరీక్ష కోసం తొలిసారిగా అభ్యర్థుల ఆధార్ నంబర్ ను కూడా పేర్కొనాలని సీబీఎస్ఈ నిబంధన పెట్టింది. అందుకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు గడువు ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గడువును జనవరి 16 వరకు పొడగించినట్టు సీబీఎస్ఈ తెలియజేసింది. ఈ గడువును మరోసారి పెంచబోమని కూడా స్పష్టం చేసింది.