
ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం
ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఎమ్మెల్యేగా ప్రమాణం ...
చెన్నై: ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ భవన్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు. ఆస్తుల కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో కోర్టు అనర్హత వేటు వేయడంతో జయ సీఎం పదవితోపాటు, ఎమ్మెల్యే పదవీని కోల్పోయారు. అనంతరం 10 నెలల తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.