కలకలం రేపిన బీజేపీ నేత కామెంట్స్‌ | In veiled attack, Sushil Modi compares Tejashwi Yadav to Nirbhaya rapist | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బీజేపీ నేత కామెంట్స్‌

Jul 14 2017 9:22 AM | Updated on Oct 17 2018 5:52 PM

కలకలం రేపిన బీజేపీ నేత కామెంట్స్‌ - Sakshi

కలకలం రేపిన బీజేపీ నేత కామెంట్స్‌

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌పై బీజేపీ నాయకుడు సుశీల్‌ కుమార్‌ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పట్నా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌పై బీజేపీ నాయకుడు సుశీల్‌ కుమార్‌ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజశ్వి యాదవ్‌ను నిర్భయ కేసులో బాలనేరస్తుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘మూతి మీద మీసాలు రాకముందే నిర్భయ రేప్‌ లాంటి దారుణానికి ఒకడు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తి అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టడంలో వింతేముంద’ని ట్వీట్‌ చేశారు.  మీసాలు రాకముందే తనపై అవినీతి కేసులు తేజశ్వి యాదవ్‌ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. 2004-2009 సమయంలో తన తండ్రి లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటల్ టెండర్లను దౌర్జన్యంగా సొంతం చేసుకున్నట్టు బీజేపీ ఆరోపించడంతో ఆయనీవిధంగా స్పందించారు.

సుశీల్‌ కుమార్‌ మోదీవ వివాదస్పద ట్వీట్‌పై ఆర్జేడీ ట్విటర్‌లో స్పందించింది. సుశీల్‌కుమార్‌ వ్యాఖ్యలతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిణస్తారా? సుశీల్‌కుమార్‌ చేసిన కామెంట్లను బీజేపీగా భావించాలా? అని ఆర్జేడీ ప్రశ్నించింది. అనవసరంగా నిర్భయ పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement